కావాల్సిన పదార్థాలు :
మటన్ - అరకిలో
దోసకాయ చిన్నది - ఒకటి
ఉల్లిపాయలు - రెండు
అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు
గరం మసాలా - రెండు టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
కరివేపాకు - ఒక రెబ్బ
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారు చేయు విధానం :
ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. ఇప్పుడు పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.
తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా, ధనియాల పొడి వేసి కలిపాక దోసకాయ ముక్కలు వేయాలి. ఐదు నిమిషాల తర్వాత ఉడికించి మటన్ వేసి మరో పదినిమిషాలు ఉడికించి దించేయాలి. ఈ కూరను రోటీలు, చపాతీలు, వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: