తూతక్ తయారీకి కావాలసిన పధార్థాలు : బొంబాయి రవ్వ : అర కేజీ  నెయ్యి : 75 గ్రా ఉప్పు : చిటికెడు వంటసోడా : చిటకెడు  మటన్ ఖీమా : 300 గ్రాములు  ఉల్లిపాయలు : రెండు కారం : అర టీ స్పూన్  అల్లం, వెల్లుల్లి : అర టీ స్పూన్  నిమ్మరసం : ఒక టీ స్పూన్ కొత్తిమీర : ఒక కట్ట నూనె : రెండు టీ స్పూన్లు ధనియాలపొడి : ఒక చెంచా గరంమసాలా : అర చెంచా నూనె : తగినంత   తయారీ చేసే విధానం : బొంబాయి రవ్వ లో నెయ్యిని కలియబెట్టి ఉప్ప, వంటసోడా వేసి కొన్ని నీళ్లు చల్లి ముద్దలా కలిపాలి. దీన్ని పన్నెండు ముద్దలుగా విడతీసి తడి వస్త్రంతో కప్పి ఉంచాలి, మటన్ కీమాను ఉడికించి పక్కన ఉంచాలి.  ఓ బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లిముద్ద, కారం, ధనియాలపొడి. ఉప్పు కలిపి మటన్ కీమా కూడా కలిపి పొడిపొడిలాడేలా వేయించాలి.  దీనిని ఓ గిన్నెలోకి తీసి నిమ్మరసం, కొత్తిమీర చేర్చాలి. పిండిముద్దను పలచగా వత్తి కీమా కూరను దాని మధ్యలో ఉంచి అన్ని వైపులా మూసేసీ దగ్గరగా చేసి కోడిగుడ్డు ఆకారంలో చుట్టే కాస్త చేత్తో వత్తాలి. ఓ బాణాలిలో నూనెవేసి సన్నని మంటమీద ఈ తూతక్ లను బంగారురంగులో వేయించి తీసి పుదీనాచట్నీతో వడ్డించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: