ఆడపిల్ల.. పుట్టింది మగాడికోసమే. ఈమెను చూస్తే అదే అనిపిస్తుంది. పుట్టిన సమయంలో అన్నయ్య, తమ్ముడు అని వారితో ఆడుకుంటూ.. వారికి బయపడుకుంటూ, వారికీ ఏదైనా కష్టం వస్తే తోడుగా ఉంటూ సాయం చేస్తుంది. ఆ తరవాత భర్త కోసం ఆమె కష్టాన్ని దారపోస్తుంది.. ఆ తర్వాత పిల్లల కోసం కష్టపడుతుంది. 

 

ఇలా జీవితం అంత వాళ్ళ కోసమే కష్టపడుతుంది ఆడది. కానీ కాలంలో మార్పులు.. పెరిగే వయసు కారణంగా ప్రతి 20 ఏళ్లకు ఒకరు దూరం అవుతూనే ఉంటారు.. పుట్టిన 20 ఏళ్లకే తండ్రి, అన్నయ, తమ్ములు దూరం అయ్యి భర్త వస్తాడు. సంవత్సరానికే పిల్లలు వస్తారు. ఆ పిల్లలకు 20 ఏళ్ళు వయసు వస్తే వాళ్ళు పెళ్లిళ్లు చేసుకొని దూరం వెళ్ళిపోతారు. 

 

కానీ భర్త ఒక్కడే కడవరకు వస్తాడు... భర్తకు భార్య.. భార్యకు భర్త చివరి వరుకు తోడు ఉంటారు. అలాంటి భర్త ప్రాణాలకు గండం ఉంది అని తెలిస్తే ఆమె బతకగలదా.. ఆ కాలంలో సావిత్రి భర్త ప్రాణాల కోసం యముడునే ఎదురించింది.. ఈ కాలంలో కూడా అలాంటి సావిత్రి ఒకరు ఉన్నారు.. ఆమె భర్త ప్రాణాలను కాపాడటం కోసం డాక్టర్లనే ఎదురించింది. ఎదిరించింది అంటే కొట్టింది అని అర్ధం కాదు.. ఆ డాక్టర్లకు ఇచ్చే కాసుల కోసం ఆమె మర్దన అయ్యింది. ఎవరు ఎప్పుడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని బుల్దాన జిల్లా పింప్లీ గ్రామానికి చెందిన లతా భగవాన్‌ కరే దంపతులకు నలుగురు కూతుళ్లు. ఎంతో కష్టపడి.. నలుగురు కూతుళ్ళకు పెళ్లిళ్లు చేసి అత్తవారి ఇన్నిటికి పంపారు. నలుగురు కూతుళ్ళకు పెళ్లి చెయ్యడంతో అప్పులు బాగా అయ్యాయి. దీంతో ఆ అప్పులు తీర్చేందుకు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసుకునే వాళ్ళు. 

 

అలాంటి సమయంలో ఆమె నెత్తిమీద మరో కష్టం వచ్చి పడింది. అదే భర్త అనారోగ్యం. భర్త భగవాన్‌ కరే అనారోగ్యంగా ఉంది అని చెప్పడంతో అదే ఊర్లో ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే అతనికి ఏదో ఇన్ఫెక్షన్ సోకి ఉండచ్చు అని.. పెద్ద ఆస్పత్రికి తీసుకు వెళ్తే తప్ప తెలీదు అని చెప్పడంతో ఆమె గుండె ఆగిపోయినట్టయ్యింది. 

 

దీంతో ఆమె వెనకడుగు వెయ్యగా రెండు రోజుల్లోనే ఆర్ఎంపీ చెప్పినట్టు ఆమె భర్త కాళ్ళు చచ్చుపడిపోయాయి. నడవలేని స్థితికి చేసుకున్నారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత తనకు లేదు అని తనలో తాను మదనపడింది. అయితే భర్తను ఎలా అయిన కాపాడుకోవాలి అని  నిర్ణయనించుకుంది. 

 

దీంతో బంధువులను.. చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు వెళ్లి సాయం అందించాలని వేడుకొని కాస్త డబ్బు తీసుకొని ఆస్పత్రికి వెళ్ళింది అక్కడికి వెళ్తే ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు చేయాలంటే రూ.5వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. ఏడుస్తూ ఆరోజు అంత ఆస్పత్రి వరండాలోనే ఉండిపోయింది ఆమె.. 

 

భర్త ఆకలిగా ఉంది అని చెప్పడంతో బయటకు వెళ్లి తన దగ్గర ఉన్న చిల్లరతో రెండు సమోసాలు తీసుకువచ్చి పెట్టింది. సమోసాలు చుట్టిన పేపరులో మరాఠీలో పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన ప్రకటన లతా కరే కంట పడింది. '‘బారామతి మారథాన్‌లో పాల్గొనండి.. రూ.3వేలు నగదు గెలుచుకోండి' అనేది ఆ ప్రకటన సారాంశం. దీంతో రాత్రంతా ఆలోచించి మారథాన్‌లో పాల్గొని రూ.3వేలు గెలుచుకోవాలనుకుంది. 

 

ఆ డబ్బుతో భర్తకు వైద్యం అందించాలి అని.. మరోసటీ రోజు బారామతి మారథాన్ ప్రారంభ కావడానికి సిద్ధమైంది.. పోటీల్లో పాల్గొనడానికి ఎంతోమంది మహిళలు స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ధరించి పరుగుకు సిద్ధమయ్యారు. అప్పుడే లతా కరే 9గజాల నేత చీరతో, పాదాలకు కనీసం చెప్పులు కూడా లేకుండా మారథాన్‌ జరిగే ప్రదేశానికి చేరుకుంది.

 

అయితే అక్కడ నిర్వాహకులు ఆమెకు పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు.. కానీ వేడుకునే సరికి ఆమెకు అనుమతి ఇచ్చారు. చివరి వరుసలో నిలబెట్టారు.. అయితే ''తాను ఎక్కడ నిలుచున్నాను అనేది కాదు... ఎలాగైన రూ.3వేలు గెలుచుకుని తన భర్తకు వైద్యం చేయించాల’నే అనేది ఒక్కటే ఆమె కళ్ల ముందు కనిపించింది. 

 

పరుగుపందెం మొదలైంది.. లక్ష్యం ముందు తన కాళ్లకు గుచ్చుకుంటున్న రాళ్లు రప్పలు కనిపించడం లేదు.. అదే లక్ష్యం.. అదే వేగం.. అదే పరుగు .. బారామతి ప్రజల చప్పట్లు ఆమెను మరింత ఉత్సాహపరిచాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ లతా కరే మారథాన్‌ విజేతగా నిలిచింది. భర్తపై లతా కరేకు ఉన్న ప్రేమను చూసి ఫిదా అయిపోయారు. 

 

అప్పటికప్పుడు మారథాన్‌ నగదు ప్రైజు రూ.3వేల నుంచి రూ.5వేలకు పెంచారు. ఆమె లక్ష్యం ముందు సమస్యలన్నీ చిన్నబోయాయి. గెలుచుకున్న డబ్బుతో భర్తను కాపాడుకుంది. అంతే మహారాష్ట్రలోని పత్రికలు, ఛానళ్లు ఆమె గొప్పతనాన్ని కీర్తించాయి. నెల తిరగకుండానే ఎంతో మంది సహాయం అందించగా ఆమె బ్యాంకుకు రూ.2లక్షల వరకు జమ అయ్యాయి. అప్పటినుండి వరుసగా మూడేళ్ల పాటు మారథాన్‌ విజేతగా లతా కరేనే గెలిచింది. ఆమెపై ఇటీవలే సినిమా కూడా వచ్చింది. ఇలా భర్తను కాపాడుకోడానికి 72 ఏళ్ళ వయసులో ఆమె గెలిచి చరిత్రకెక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: