కడుపులో బిడ్డను మోస్తున్నప్పటి నుండి ప్రతి తల్లి ధ్యాస పుట్టబోయే బిడ్డ మీదనే  ఉంటుంది. బిడ్డ ఇలా ఎదుగుతుందో అనే ఆలోచన ఒక పక్క  డెలివరీ డేట్ దగ్గర పడే దగ్గరనుండి  సహజ ప్రసవం అవుతుందా ! లేక ఆపరేషన్ అవుతుందా !  అన్న అనుమానం  ప్రతి స్త్రీ లో ఉంటుంది. ఆపరేషన్ చేశయించుకుని బిడ్డని కంటే రాబోయే రోజుల్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అన్న ఆలోచనలో ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవవచ్చు. గర్బిణీలు ఎక్కువ సమయం నిలబడటం వల్ల కడుపులో ఉన్న శిశువు గురుత్వాకర్షణకు గురి అవుతారని, దాంతో పెల్విస్ వద్దకు చేరుకుంటారని కొందరు నిపుణులు చెప్పడం జరిగింది.

 

 

 

ప్రెగ్నెన్సీ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఎక్కువ సమయం నిలబడకపోవడం మంచిది. నార్మల్ డెలివరీ కోరుకొనే వారు గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ఇది.  యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల రెస్పిరేషన్ రెగ్యులేట్ చేయడానికి, హార్ట్ బీట్ మరియు మీ శరీరం విశ్రాంతి పొందడానికి బాగా సహాయడపడుతుంది. యోగానిపుణుల సమక్షంలో, రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల శరీరం మరింత ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది మరియు ఇది నార్మల్ డెలివరీకి సహాయపడుతుంది.గర్భిణీ స్త్రీలు ప్రీనేటల్ క్లాసులకు హాజరవ్వడం వల్ల, డెలివరీ సమయానికి మీకు అవసరం అయ్యే ప్రెగ్నెన్సీ చిట్కాలన్నింటిని తెలుసుకోవచ్చు. ప్రీనేటల్ క్లాస్ లో కొన్ని ప్రెగ్నెన్సీ వ్యాయామాలు నేర్చుకోవడం వల్ల బేబీ పుట్టే సమయంలో నొప్పులను నివారించవచ్చు.

 

 

 

 

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీ చిట్కా, ముఖ్యంగా నార్మల్ డెలివరీకి నీటి అవసరం ఎక్కువగా ఉంది. గర్భధారణ సమయంలో గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధక సమస్యను నివారించుకోడం కోసం అధికంగా నీరు, ద్రవాలు, తాజా జ్యూసులు తీసుకోవడం చాలా అవసరం.గర్భాధారణ సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుడదని మీఅంతట మీరు ప్రామిస్ చేసుకోవాలి. ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే అంత ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎల్లప్పుడు సంతోషంగా గడపడానికి తప్పక ప్రయత్నించాలి. మీ ప్రవర్తనే మిమ్మల్ని మరియు కడుపులో పెరిగే బిడ్డకు ఆరోగ్యకరం.మసాలా దినుసులు, స్పైసీ ఫుడ్ మితంగా తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీకి సహాయపడుతాయి. స్పైసీ ఫుడ్స్ వల్ల నార్మల్ డెలివరీ ఉద్దీపన చేయడానికి ప్రభావం చూపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: