బంగాళాదుంప జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో బాగా సహాయపడుతుంది. బంగాళదుంపను కట్ చేసి తురుముకోవాలి. తురిమిన బంగాళదుంపను ఒక క్లాత్ లో వేసి పిండి రసం తీయాలి. ఈ రసాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ సులభంగా తొలగిపోతాయి. అలాగే గర్భిణీగా ఉన్నప్పటి నుండే బాదం నూనె, కోకోవా బటర్ తో పొట్ట భాగాల్లో మసాజ్ చేసుకుంటూ ఉంటే స్ట్రెచ్ మార్క్ వచ్చే అవకాశం ఉండదు. సుగర్, బాదం నూనె, విటమిన్ E ఉండే క్రీం తో పాటుగా కలబంద రసాన్ని కలుపుకుని ఆయిల్ గా తయారు చేసుకుని దాన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంచదారను, నిమ్మకాయతో కలిపి స్ట్రెచ్ మార్క్స్ పై పూసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో ఆముదం గ్రేట్ రెమెడీ. ఇది స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా తొలగిస్తుంది. ఆముదం నూనెను చారలున్న ప్రదేశంలో అప్లై చేసి, మర్ధన చేయాలి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆముదంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు నిరూపించబడినది. తేనెలో స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో తేనెను రాయాలి. ఇలా తేనె రాసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి, ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి