గర్భధారణ సమయంలో అధికంగా మద్యం సేవించడం వల్ల పిండంకు ఆల్కహాల్ సిండ్రోమ్ వస్తుంది.గర్భధారణ సమయంలో ఆవిరి స్నానాలు, వేడి నీటి స్నానాలకు దూరంగా ఉండటం మంచిది. శరీరంలో వేడి నీటిని అధికంగా వాడటం వల్ల గర్భాశయం వేడెక్కుతుంది మరియు శిశు మరణానికి కారణమవుతుంది.గర్భధారణ సమయంలో మితమైన వ్యాయామం కొంతవరకు సిఫార్సు చేయబడింది. ఎక్కువగా వ్యాయామం చేయడం కారణంగా మీ హృదయ స్పందన నిమిషానికి 160 పైన పెరిగినప్పుడు, శిశువులోకి వెళ్ళే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల శిశువు శక్తిని కోల్పోతుంది, శిశువు మెదడుకు ఆక్సిజన్‌ను అడ్డుకుంటుంది.
కాబట్టి గర్భధారణ సమయంలో తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి.ఎక్కువ సమయం,చాలా గంటలు నిలబడడం వల్ల గర్భధారణ సమయంలో ఆటంకాలు వస్తాయి. వీలైనంత వరకు కూర్చోవడం, పడుకోవడం చేయాలి. గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు, తీయించుకోవడం మానుకోవాలి. డిప్రెషన్ రకరకాల సమస్యలను కలిగిస్తుంది. ఇది తల్లి బిడ్డకు ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.సరైన పోషకాలు తీసుకోకపోవడం, సరైన ఆహారాన్ని తినకపోవడం, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు అభివృద్ధి చెందరు. అలాగే గర్భిణీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి