బెంగళూరు: పోలీసు వ్యవస్థలో ట్రాన్స్‌ఫర్లు అన్నది సర్వ సాధారణం. కానీ.. 20 ఏళ్లలో 40 సార్లు ట్రాన్స్‌ఫర్ అంటే ఆ అధికారా ఏ విధంగా కుంభకోణాలను వెలికితీశారో అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఒక మహిళా అధికారి అంటే ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. నిజం.. ఐపీఎస్ అధికారి డీ రూప అనే ఒక మహిళ నేరస్థుల గుండెల్లో నిద్రపోయింది. తన 20 ఏళ్ల కెరియర్‌లో 40 సార్లు వేరే వేరే ప్రాంతాలకు బదిలీ అవుతూ వచ్చారు. ప్రస్తుతం డీ రూప రాష్ట్ర హోం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ పదవిని చేపట్టిన మహిళగా డీ రూప రికార్డు కొట్టారు. మరోసారి తనను ట్రాన్స్‌ఫర్ చేయడంపై చర్చ సాగగా.. సోషల్ మీడియా ఖాతా ద్వారా రూప స్పందించారు.

ప్రభుత్వ ఉద్యోగం అన్న తరువాత ఒక చోటు నుంచి మరో చోటుకు ట్రాన్స్‌ఫర్ అనేది సర్వసాధారణమని, ఈ ఉద్యోగం ఇదో భాగమని అన్నారు. 20 ఏళ్ల తన కెరీర్‌లో తన వ్యక్తిత్వంలో ఎటువంటి మచ్చ లేదని ఆమె చెప్పారు. నిజానికి తన వృత్తిలో కొనసాగుతున్న చాలా మంది అధికారులు అనేక అంశాల జోలికి వెళ్లకూడదని అనుకుంటూ ఉంటారని, అలా అయితే బదిలీలు కాకుండా ఒకేచోట ఉండొచ్చని రూప తెలిపారు. కానీ తాను వారి మాదిరి ఉండలేనని, వృత్తిలో భాగంగా ఏ విషయానికి ఎలా స్పందించాలో ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చానని ఆమె చెప్పారు. కాగా.. రూప మొట్టమొదటి సారిగా వార్తల్లోకి ఎప్పుడు వచ్చారంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సన్నిహితులరాలు శశికళపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఆ ఆరోపణలు చేసింది మరెవరో కాదు రూపనే. ఈ ఘటనలో రూపపై రూ. 10 కోట్ల పరువు నష్టం కేసు కూడా వేశారు. అయినప్పటికి రూప వెనుకంజ వేయలేదు. తాను ఏ ఆరోపణ అయినా సరైనా సాక్ష్యాలు లేకుండా చేయనంటూ ముందుకు సాగారు. ఇలా అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా రూప తన కెరీర్‌లో నిజాయితీ పరురాలుగా కొనసాగారు. 2016, 2017లలో పోలీసు విభాగంలో అందించే రాష్ట్రపతి పురస్కారాలను కూడా అందుకున్నారు. బ

మరింత సమాచారం తెలుసుకోండి: