మాములుగా డైట్ ని ఎవరు ఫాలో అవుతారు. ఎక్కువ బరువు ఉన్నవారు సన్నగా మారడం కోసం డైట్ ని ఫాలో అవుతారు.అందుకోసం వాళ్ళు భోజనం తక్కువ తీసుకుంటూ పండ్లు, పండ్ల రసాలు వీటినే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఆమె కేవలం రోజు అరటిపండు మాత్రమే తినడం వల్ల ఆ తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి వివరించింది. మరి ఆమె చెప్పిన సంగతులు ఏంటో తెలుసుకుందాం.

ఆమె పేరు యూలియా. ఈమె పన్నెండు రోజుల పాటు అరటిపండ్ల తినింది. మూడు పూటలా అరటిపండ్లనే ఆహారంగా తీసుకుంది దీనినే 'బనానా డైట్' అని అంటాము. ఈ డైట్ చేయడం వల్ల ఆమెకు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. యూలియా బనానా తినడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ వెళ్లిపోయాయని,ఏకాగ్రత మరియు చురుకుదనం పెరిగిందని  చెప్పుకొచ్చింది.అలాగే రోజంతా పనిచేసిన అలసిపోవడం లాంటివి ఏమి లేవని ఆమె తెలిపింది. ఇంకా అంతకు ముందు దాని కంటే అరటిపండ్లను తీసుకున్న తర్వాత చర్మంపై ఎంతో తేజోవంతం అయిందంటూ ఆమె తెలిపింది.

ఇవే కాకూండా ఆమెలో కండర శక్తి పెరిగింది. మరియు శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారైదని తెలిపింది. ఇంకా తన బరువులో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. యూలియా అన్ని రోజుల పాటు అరటిపండ్లను తింటూ సమయానికి నిద్ర, వ్యాయాయం చేస్తూ డైట్ ని పూర్తి చేసింది. దీని బట్టి ఆమె చెప్పదలుచుకున్నది ఏంటంటే బనానా తింటే శరీరానికి మరియు ఆరోగ్యానికి చాలా మంచిదని  నేను చెప్పిన మాటల వల్ల మీకు అర్థం అయి ఉంటుంది. కాబట్టి  
మీరు కూడా ఈ బనానా డైట్ ని చేయండి.అరటిపండ్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి.ఈ డైట్ ని కనుక ప్రతి ఒక్కరు చేస్తే నాలాగా మీరు ఆరోగ్యమంతంగా తయారవుతారు.

రోజంతా మీ ఇంటి పనులను ఎలాంటి అలసటకి లోను కాకుండా చేసుకోగలుగుతారు, బరువు తగ్గుతారు అని యూలియా ఈవిధంగా బనానా డైట్ చేయడం వల్ల తనలో వచ్చిన మార్పులను చక్కగా వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: