మ‌హిళ‌ల‌ను అన్ని రంగాలలో స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులు ఇవి. ఒకప్పుడు అయితే స్త్రీలకు వంటిల్లే చాలు అని అనుకున్నారు. ఆ త‌రువాత‌ వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపథం వైపు పయనించగలరని గుర్తించారు. స్త్రీ, పురుష అసమానతలను పక్కనపెట్టి వారిని ప్రొత్సహిస్తే రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించగల నేర్పరితనం వారిలో ఉన్న‌ది.  అందుకే పట్టణ ప్రాంత మహిళలకే కాకుండా, చదువురాని గ్రామీణ స్త్రీలు సైతం కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల ద్వారా స్వావలంబన సాధిస్తారని వారికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప‌లు ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాయి.

వాటిలో ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ పథకం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్త్రీశక్తి పథకం, లఘు పరిశ్రమలు,  గ్రామీణ పరిశ్రమలకు పథకం,  విష‌యం తెలుసుకున్న హుటాహుటిన చేరుకొని బందోబ‌స్త్,   చిన్న చిన్న వ్యాపారస్ధులకు ఋణ సహాయం, మహిళా చైతన్యానికి నాబార్డు పథకాలూ - ఋణాలు, డ్వాక్రా (గ్రామీణ ప్రాంత మహిళా, శిశు అభివృద్ధి), స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ - మహిళా ఉద్యమ నిధి, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ప‌థ‌కాలు మ‌హిళ‌ల కోసం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

జాతీయబ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్టేట్ పైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్ధిక సంస్ధలు కూడా మ‌హిళ‌ల‌కు ఋణాలు మంజూరు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా  నాబార్డ్ ' స్త్రీల కొరకే అనేక పథకాలు, వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న‌ది.  స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా, ఐ.ఆర్.డి.పి వంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పించుకుంటూ, తమ ప్రాజెక్టు ద్వారా మరెంతోమందికి మార్గదర్శకులవుతున్నారు మహిళలు. వ్యాపార దృష్టి, పరిశ్రమల స్ధాపనలో చురుకుగా పాల్గొనే ఉత్సాహం ఉన్న స్త్రీలకు ఋణాలను అందించేదీ ఈ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పథకం. మహిళలు తమకు తామే ఒక స్వయం ఉపాధిని కల్పించుకోవడమే కాక, మిగిలిన వారికి కూడా ఒక ఆసరా ఇవ్వగలిగినవారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: