బెంగళూరు వంకాయ పచ్చడి కావలసిన పధార్థాలు :
బెంగళూరు వంకాయలు (పెద్దవి) -2
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
నిమ్మరసం - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
మినపప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 5
నూనె - 4 టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
ఉల్లితరుగు - పావు కప్పు
తయారి చేసేవిధానం :
బెంగళూరు వంకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ తిప్పాలి. చల్లారిన బెంగళూరు వంకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి తిప్పాలి. బౌల్లోకి తీసుకుని వేయించిన పోపు ను వేసి బాగా కలపాలి. నిమ్మరసం, ఉల్లితరుగు వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: