సింగపూర్ అందాలని ఈ చిత్రంలో ఎంతో అందంగా చూపించడం జరిగింది. సింగపూర్ ఎంత బాగుంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది.  మద్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొంది హీరోగా ఛాన్స్ కోసం చిరంజీవి ఎదురు చూస్తున్నాడు. కానీ పెద్ద పాత్రలు ఉండే సినిమాల నుండి అవకాశం రాలేదట. అప్పుడే తన నటనతో ఆ పాత్రల్లో రక్తికట్టించిన చిరంజీవి లవ్ ఇన్ సింగపూర్ మూవీలో నటించాడు. రంగనాధ్ కూడా హీరో అయినప్పటికీ ఆ రోజుల్లో చిరంజీవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా, చిరంజీవి చిత్రంగా నిర్మాతలు ప్రచారం చేసారు. ఈ చిత్రానికి ఓ ఎస్ ఆర్ ఆంజనేయులు దర్శకత్వం వహించారు. ఎస్ వి ఎస్ ఫిలిమ్స్ అధినేతలు నిర్మించారు. ఈ సినిమా  తెలుగు, మలయాళ భాషల్లో ఒకే సారి నిర్మించారు.

రంగనాథ్, చిరంజీవి, లత తెలుగులో నటించగా... మలయాళంలో ప్రేమ్ నజీర్, సైమన్, లత నటించారు.  సింగపూర్ అందాలను వెండితెరపై అందంగా చూపించడం ఎంతో అద్భుతం అని అందుకే ఈ చిత్రం తన కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ అని  ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి చెబుతూనే ఉంటాడు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా లో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ సాగింది. విదేశాల్లో చిరంజీవికి అదే మొదటి షూటింగ్. తనే క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. వారం రోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన మూడు చిత్రాలు విడుదల కావడం విశేషం.

కాళీ, తాతయ్య ప్రేమ లీలలు ఈ మూడు కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. ఇవి పూర్తి అయ్యాక   లవ్ ఇన్ సింగపూర్ రిలీజై మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టులంతా సింగపూర్ వారే. ఈ సినిమా ప్రివ్యూ మద్రాసు లోని మీనా థియేటర్లో  చూసి చిరంజీవి కారులో బయటకు వస్తుంటే తనని కమలహాసన్ చూశారు. మెగాస్టార్ మాత్రం చూడలేదు. కమల్ పరిగెత్తి చిరు కారుని ఆపినా చిరు గమనించలేదు. కానీ తర్వాత చిరు కమల్ ఇంటికి వెళ్లి సరదాగా కొంతసేపు గడిపాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: