శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అయితే తాజాగా ‘జంగా’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గ్లింప్స్‌ని విడుదల చేశారు.

‘కొన్ని లక్షల ఏండ్లు పట్టింది.. పశువు మనిషి అవ్వడానికి.. మళ్లీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను.. మనిషి పశువు అయితే.. మరణం వదం అయితాది’ అంటూ త్రిగుణ్ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్స్, కనిపించిన తీరు, రా అండ్ రస్టిక్ లుక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, త్రిగుణ్ ఇలా అందరూ ఈ సినిమాలో ఇంటెన్స్ రోల్స్‌ని పోషించినట్టుగా కనిపిస్తోంది. త్రిగుణ్ కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్‌గా నిలిచే చిత్రం కానుందని అనిపిస్తోంది.

రాంగోపాల్ వర్మ ‘జంగా’ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. గ్లింప్స్ బాగుందని, త్రిగుణ్‌కి, టీంకు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు.

భావోద్వేగాలు, పుట్టుక చావు మధ్య ఉండే సంక్లిష్టతలు, ఆధ్యాత్మికతను అన్వేషించే కథనంతో కెవిన్ గడ్డం(శ్రీహరి) ఈ మూవీని తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. త్రిగుణ్ తన అద్భుతమైన హావభావాలు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రజెన్స్‌తో అందరినీ ఆకర్షించేలా ఉన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త అవతారంలో మరోసారి మెప్పించనున్నారు.

ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్ రాజు , రఘు కారుమంచి, రచ్చ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



 నటీనటులు : త్రిగుణ్, వరలక్ష్మి శరత్ కుమార్, మధునందన్, గగన్ విహారి, శ్రవణ్ రాఘవేంద్ర, చందు గౌడ, నేహా పఠాన్,సమీర్, నాగ మహేష్,భూపాల్ రాజు , రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు.

 టెక్నికల్ టీం

బ్యానర్ :ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ
సమర్పణ :శ్రీమతి వనిత కిలారి
నిర్మాతలు : రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి
దర్శకుడు : కెవిన్ గడ్డం(శ్రీహరి)
సంగీతం : కృష్ణ సౌరభ్
కెమెరా : వెంకట్ సి. దిలీప్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో :  సాయి సతీష్


మరింత సమాచారం తెలుసుకోండి: