ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనివల్ల ఇప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. ఇందులో ముఖ్యంగా ఆటో రంగానికి సంబంధించి విక్రయాలపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఆటో రంగంలో భారీ అమ్మకాలను పెంచుకునేందుకు వాహన సంస్థలు భారీగా కృషి చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో తన ఎలక్ట్రికల్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వీటిని ముందుగా బుక్ చేసిన వారికి ఉచితంగా ఐదు వేల వరకు రాయితీని ఇవ్వబోతోంది. రిఫరెన్స్ పర్చేస్ కోసం అదనపు క్యాష్ డిస్కౌంట్ ని అందించపోతోంది. అయితే ఇది కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే సుమా...

 


అయితే ఈ ఆఫర్ ఏప్రిల్ 17 నుంచి మే 15 వరకు అందుబాటులో మాత్రమే ఉంచింది హీరో సంస్థ. అయితే దీనికి 2999 రూపాయలు డబ్బులు పెట్టి బుకింగ్ ముందుగానే చెల్లించాలి. ఒకవేళ లాక్ డౌన్ జూన్ వరకు పొడిగించినట్లు అయితే స్కూటర్ డెలివరీలు జూన్ నెలాఖరు డెలివరి చేయబడతాయి. అయితే ఈ ఆన్లైన్ బుకింగ్ మాత్రం అన్ని ప్రదేశాలకు అనుమతి లేదు, కొన్ని యూనిట్లకు మాత్రమే అనుమతి ఉంది. ఇక్కడ ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి మాత్రమే స్కూటర్లను అంద చేయబడతాయి. 

 


ఇక డిస్కౌంట్ విషయానికి వస్తే హీరో ఎలక్ట్రికల్ స్కూటర్ లు ఐదు వేల రూపాయల ఇన్స్టంట్ కాష్ బ్యాక్ ఇవ్వగా గ్లైడ్, ఈ - సైకిల్ మోడల్స్ కావాలనుకునే వారికి మూడు వేల రూపాయల వరకు రాయితీ ఇచ్చింది. ఇక అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్ లపై కూడా కాష్ బ్యాక్ రాయితీలను అందుబాటులో ఉంచింది. కస్టమర్లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్లో ఈ సేవలు అందిస్తున్నట్లు హీరో ఎలక్ట్రికల్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పుకొచ్చారు. దేశంలో రోజురోజుకీ కాలుష్యరహిత రవాణా అందించేందుకు హీరో సంస్థ తోడ్పడుతుందని ఆయన ఈ ముఖంగా తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: