ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటా ఆటో మొబైల్స్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి కారులు, కొన్ని ఎలెక్ట్రానిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా టాటా వాళ్ళు సరికొత్త ఫీచర్లతో ఉన్న బస్సును మార్కెట్ లోకి విడుదల చేశారు.టాటా మోటార్స్ 26 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను ముంబైలోని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ కు అందిజేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులకు అన్నీ సౌకర్యాలకు అనుగుణంగా ఉండేలా ఉన్న అత్యాధునిక బస్సులను 340 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేయగా అందులో భాగంగా 26 బస్సులను విడుదల చేసింది.



25 సీట్ల టాటా అల్ట్రా అర్బన్ 9/9 ఎలక్ట్రిక్ ఎసి బస్సులను ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఎలక్ట్రిక్ బస్సులతో ప్రారంభించడంతో పాటుగా టాటా మోటార్స్ బ్యాక్బే, వర్లి, మాల్వాని మరియు శివాజీ నగర్‌లోని నాలుగు ముంబై డిపోలలో కూడా పూర్తి ఛార్జింగ్ సదుపాయాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. టాటా గ్రూప్ యొక్క విశిష్టమైన 'వన్ టాటా' ప్రణాళికలో భాగంగా, ఈ బస్సులకు కావల్సిన నిరంతరాయంగా సేవలను అందించడానికి టాటా తన వివిధ గ్రూప్ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. టాటా పవర్ సరఫరాతో సహా అప్‌స్ట్రీమ్ మరియు దిగువ విద్యుత్ సౌకర్యాల తో పాటుగా బస్సు ఛార్జింగ్ పాయింట్లు కూడా అందిస్తున్నారు..



భారతదేశంలోని 5 నగరాల్లో 215 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది. ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ కలిపి సుమారు 4 మిలియన్ కిలోమీటర్లకు పైగా నడిచి కీలకమైన డేటాను సేకరించాయి. ఈ బస్సు ప్రత్యేకత విషయానికొస్తే..ఎర్గోనామిక్ సీట్లు, విశాలమైన ఇంటీరియర్స్, పోర్టింగ్ ఛార్జింగ్ వంటి యుటిలిటీ ప్రొవిజన్స్, ఆన్-ది-గో కనెక్టివిటీ కోసం వైఫై హాట్‌స్పాట్, దాంతో పాటుగా లిఫ్ట్.. లిఫ్ట్ మెకానిజం సాయంతో వికలాంగులు తమ వాహనాలతో సులువుగా బస్సులోకి ప్రవేశించేందుకు వీలు ఉంటుంది. వీటికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రముఖ నగరాల్లో డిమాండ్ కూడా పెరుగుతోంది.. దీంతో టాటా కంపెనీ మరో విజయాన్ని సొంతం చేసుకుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: