కొత్త వాహనాలకు భారతదేశంలో కొదవ లేదు..ఎన్నో కంపెనీలు..కొత్త ఫీచర్లతో  యువతను ఆకట్టుకునే విధంగా కొత్త ద్వి చక్ర వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ చెన్నై దిగ్గజ కంపెనీ టీవీఎస్ కూడా మరొక కొత్త బైక్ లను విడుదల చేసింది. యువతను ఆ బైక్ తెగ ఆకట్టుకుంటుంది.ఆ బైక్ పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..తాజాగా భారత్ మార్కెట్లో తమ పాపులర్ అపాచీ సిరీస్ లో సరికొత్త వేరియంట్ ను విడుదల చేసింది..! టీవీఎస్ అపాచీ ఆర్ టి ఆర్ 200.  


సింగిల్ ఛానల్ ఏబిఎస్ మోడల్ను సరికొత్త రైడ్ మోడ్స్ తో విడుదల చేసింది.. 4V ఈ బైక్ లో స్పోర్ట్స్, అర్బన్ రెయిన్ అనే 3 రైడ్ మోడ్స్ ను అందిస్తోంది. అర్బన్ మోడ్ రోజువారీ రైడ్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అర్బన్ మోడ్ ఇంజన్ నుండి గరిష్ట పవర్ ను గ్రహించి వెంటనే రెస్పాండ్ అయ్యే ల ఈ మోడ్ ను డిజైన్ చేశారు.రెయిన్ మోడ్ లో స్ట్రాంగ్ లివర్ పల్సేషన్ అందించేందుకు ఏబీఎస్ నుండి గరిష్ట స్పందనను పొందుతుంది. తడిగా ఉన్న రహదారులపై ఈ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ మోడ్ ట్రాక్, హైవేల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.


 ఈ మోడ్ ఇంజన్ నుంచి గరిష్ట శక్తిని పొంది, వేగవంతమైన యాక్సిలరేషన్ ను అందిస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1.28 లక్షలు. ఇకపోతే ఈ బైక్ అందరినీ ఆకట్టుకోవడానికి ఆ బండి ప్రత్యేకతలు అని అంటున్నారు. ఒకసారి చూద్దాం.. రేస్  ట్యూన్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్, గ్లైడ్ త్రు టెక్నాలజీ, ఎల్ఈడి హెడ్ల్యాంప్స్ మొదలగు ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మార్కెట్ లో ఈ బైక్ లకు డిమాండ్ ను అందుకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: