ఇప్పుడున్న ఈ కాలంలో అందంగా కనిపించాలంటే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలామంది అందంగా కనిపించడం కోసం మేకప్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఏదైనా శుభకార్యాలకు అటెండ్ అవ్వాలన్నా ఖచ్చితంగా మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. అలా వేసిన మేకప్ ఎండలో తిరగడం వల్ల అరగంటలో నే మేకప్ మొత్తం కరిగి పోతుంది. అందుకే ఈ వేసవికాలంలో మేకప్ వేసుకున్నా కరిగిపోకుండా వుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1). ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్:
మీ ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ని అంతా తీసేసి,  జెంటిల్ ఫేస్ వాష్ చేయడం ద్వారా ఇది మీ చర్మానికి మరింత అందాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు..


2). ఐస్ క్యూబ్:
ఈ టిప్ మేకప్ వేసుకునేటప్పుడు తప్పనిసరి . ఒక ఐస్ క్యూబ్ ముక్కను తీసుకొని,  ఒక మెత్తని గుడ్డలో చుట్టి, ఫేస్ అంతా రాయడం వల్ల కళ్ళ చుట్టూ వుండే చర్మం దగ్గర మాత్రం రాయకండి. ఒక క్లీన్ టవల్ తీసుకొని ముఖం అంతటా మెత్తగా తుడవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన మేకప్ ను వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం చల్లగా మారుతుంది. అలాగే పోర్స్ క్లోజ్ అవుతాయి. ఇక మేకప్ కరిగిపోకుండా ఉంటుంది..


3).టోనర్ :
 మీకు సూట్ అయ్యే టోనర్ ను తీసుకొని ముఖం అలాగే మెడ మీద అప్లై చేయాలి. ఇది మీ స్కిన్ ను రీఫ్రెష్ చేస్తుంది.

4). సన్ స్క్రీన్ లోషన్ :
 సమ్మర్ లో మీరు క్రీమ్ బేస్డ్ సన్స్క్రీన్ లోషన్ ను ఉపయోగించకూడదు. జెల్ బేస్ లేదా లోషన్ బేస్ ఉన్నది కానీ వాడవచ్చు.

 అలాగే ప్రైమర్, లైట్ మేకప్, ఆయిల్ బ్లాటింగ్ షీట్స్, ఫినిషింగ్ స్ప్రే, పౌడర్ బ్లష్, వాటర్ ప్రూఫ్ ఫార్ములా ఇలాంటి చిన్నచిన్న పద్ధతులు పాటించడం వల్ల ఎండలో కూడా మేకప్ కరిగిపోకుండా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: