కియా కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఖచ్చితంగా ఒకటిగా చెప్పవచ్చు. ఇక ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ గా విడుదల కానుంది. ఈ కార్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం చివరినాటికి భారతీయ మార్కెట్లో ఈ కారు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని పాత మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉండనుంది.ఇక ఇండియన్ మార్కెట్లో కియా మోటార్స్ 2023 కియా సెల్టోస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఈ SUV తాజా వెర్షన్ ను కొత్త ఉద్గారాల ప్రకారం ఇంజన్‌లతో తీసుకువస్తుంది. 2023 కియా సెల్టోస్ SUV 1.4-లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఈ SUV ఇప్పుడు కేవలం 1.5-లీటర్, సహజ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 1.5-లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది.


ఇది బేస్1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 113bhp వద్ద, 144Nm మాక్సిమం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVT యూనిట్‌తో ఈ కారు ఫిక్స్ చేయబడింది. మరోవైపు, 1.5-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ 115bhp వద్ద 250Nm మాక్సిమం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా, ఈ అప్డేట్ చేయబడిన పవర్‌ట్రెయిన్ ఇప్పుడు 6-స్పీడ్ iMT యూనిట్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.2023 కియా సెల్టోస్ SUV టాప్-స్పెక్ వెర్షన్ ధర వచ్చేసి రూ.14.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఇంకా ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.15.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.ఇక కియా సెల్టోస్ డీజిల్ బేస్ 'HTE' వేరియంట్ ధర వచ్చేసి రూ.12.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా వుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన టాప్-స్పెక్ ఎక్స్-లైన్ ట్రిమ్ ధర వచ్చేసి రూ. 19.65 లక్షలు (షోరూమ్, ఇండియా)గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: