అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సింగ్, త్రెడ్డింగ్ వంటి పద్దతులను అనుసరిస్తారు. వీటి కారణంగా ఆ భాగంలో చర్మం నల్లగా, కఠినంగా మారే అవకాశం ఉంది. ఎటువంటి నొప్పి దుష్ప్రభావాలు లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఒక గిన్నెలో పసుపు, నిమ్మరసం, పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి ఆరిన తరువాత కడిగివేయాలి. ఈ టిప్ ని వారానికి రెండుసార్లు పాటించడం వల్ల అవాంఛిత రోమాలు త్వరగా తొలగిపోతాయి. అవాంఛిత రోమాలు ఉన్న చోట పసుపు, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని రాసి ఆరిన తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు రాయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అవాంఛిత రోమాలతో బాధపడే వారు నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని రాయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అవాంఛిత రోమాలను తొలగించడంలో బంగాళాదుంప జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ జ్యూస్ రాత్రి పడుకునే ముందు అవాంఛిత రోమాలపై రాయాలి. ఉదయాన్నే నీటితో కడిగి వేయాలి.


వారానికి నాలుగు సార్లు ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. నానబెట్టిన పెసర పప్పును పేస్ట్ గా చేయాలి. తరువాత అందులో పాలను పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి ఆరిన తరువాత కడిగివేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ టిప్స్  పాటించడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోవడంతో పాటు చర్మం కూడా నల్లగా మారకుండా ఉంటుంది.ఇంకా అలాగే ఒక గిన్నెలో పసుపు, శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో తగినన్ని పాలను పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి బాగా ఆరనివ్వాలి. తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి. అదేవిధంగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను, పంచదారను తీసుకోవాలి. తరువాత అందులో ఎగ్ వైట్ ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. ఆరిన నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: