మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది.  మెగాస్టార్ చిరంజీవి .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. పవన్ కళ్యాణ్ ఇలా ఏ ఒక్కరికి సంబంధించిన వార్తలైనా సరే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి . అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ఏవిధంగా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే . మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ ..మెగా వారసుడు కోసం కొన్ని సంవత్సరాలగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ కోరికను నెరవేర్చబోతుంది లావణ్య త్రిపాఠి అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయ్యింది.


ఫైనల్లీ అదే వార్తను నిజం చేసింది లావణ్య త్రిపాఠి . మేం తల్లిదండ్రులం కాబోతున్నాం.. మా లైఫ్ లో కొత్త రోల్ స్టార్ట్ కాబోతుంది అంటూ అఫీషియల్ గా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టింది . అప్పటినుంచి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠికి సంబంధించిన వార్తలు బాగా ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి.  అయితే లావణ్య త్రిపాఠి కి ఎన్నో నెల ..? ఆమెకు డెలివరీ డేట్ ఎప్పుడు ..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠికి ఏడవ నెల కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది .


అంతేకాదు ఆమెకు 9వ నెల పెట్టగానే శ్రీమంతం చేయబోతున్నారట . మెగా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ జరిగి చాలా నెలలే అవుతుంది.  ఇంకా పక్కాగా చెప్పాలి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ కలిసిందే లేదు. కనీసం ఈ శ్రీమంతపు వేడుక ద్వారా అయినా సరే మళ్లీ మెగా ఫ్యామిలీ  అల్లు ఫ్యామిలీ కలవబోతుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఈ ఫంక్షన్ కి కూడా అల్లు అర్జున్ డుమ్మా కొడితే ఇక మెగా ఫ్యామిలీతో పూర్తిగా సంబంధాలు పెంచేసుకున్నట్లే అంటూ మాట్లాడుకుంటున్నారు.  లావణ్య త్రిపాఠి శ్రీమంతమేమో గాని ఇప్పుడు అందరి కళ్ళు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదేవిధంగా అల్లు అర్జున్ ఎప్పుడు ఎప్పుడు కలుస్తారో అనే దాని పైనే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: