
ఈ సినిమాలో కామెడీ సీన్లు అద్భుతంగా ఉండగా ఈ సినిమా దర్శకుడు కార్తీక్ రాజుకు సైతం నెటిజన్ల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలం తర్వాత కేతిక శర్మ ఈ సినిమాతో హిట్ అందుకోగా ఇవానా ఈ మూవీతో తెలుగుతో తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నారు. అంచనాలను మించి మెప్పించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీ విష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. వెన్నెల కిషోర్ సైతం ఈ మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.
బుక్ మై షో వెబ్ సైట్ లో 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించి 50 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈరోజు, రేపు సింగిల్ మూవీ కలెక్షన్లు ఫస్ట్ డే కలెక్షన్లను మించి ఉండే అవకాశాలు ఉన్నాయి. శ్రీ విష్ణు అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సింగిల్ మూవీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీ విష్ణు గత సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తోంది.
శ్రీ విష్ణు భవిష్యత్తులో సైతం ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాల హవా తగ్గడంతో సింగిల్ మూవీ డామినేషన్ కొనసాగుతోంది. నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా కలెక్షన్లలో కొంత మొత్తాన్ని భారత సైన్యం కోసం ఖర్చు చేస్తానంటూ చేసిన ప్రకటనపై కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ వీకెండ్ కు సింగిల్ మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.