
భారత మీడియానే కాదు పాకిస్తాన్ మీడియా కూడా ఇలాగే తయారయ్యింది. అసలు జరుగుతున్న యుద్ధానికి సంబంధం లేకుండా సమాచారం కంటే ఎక్కువగా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నాయి. ఇండియా తన సైనిక విధానం పైన చాలా స్పష్టంగానే ఉన్నది.. ఇప్పటివరకు దాడికి ప్రతి దాడి అనే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నది. కేవలం పాకిస్తాన్ చేసేటువంటి కుట్రని డ్రోన్లను ఎప్పటికప్పుడు కూల్చివేస్తూ ఉన్నది. కానీ మీడియా మిత్రులు మాత్రం పాకిస్తాన్ నుండి కాశ్మీర్ ను విముక్తి చేసిందని ప్రకటనే కాకుండా పాకిస్తాన్ అధ్యక్షుడిని అజ్ఞాతంలోకి పంపించారని భారత్ విజయం సాధించిందని.. ఇండియా ఒక్క రాత్రిలోనే యుద్ధాన్ని ముగించేయాలనుకుందంటూ ఒక ఛానల్ ని మించి మరొక ఛానల్ ఇలాంటి తప్పుడు వార్తలను హైలెట్ చేస్తున్నాయట.
ఇక పాకిస్థాన్ నుంచి కూడా చాలానే ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాలను కూల్చేసామని చెబుతూ అక్కడ వారిని నమ్మేసెల ప్రచారం చేస్తున్నాయి. మరొకవైపు పాకిస్తాన్ అధికారికంగా తాము ఎలాంటి దాడులు చేయడం లేదంటూ ఆరోపిస్తోంది. మరొకపక్క భారత్ కు చాలా నష్టం చేశామనే విధంగా ఆరోపణలు చేసింది. ఇలా అన్నీ కూడా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తోంది పాకిస్తాన్.
యుద్ధం అనే విషయంలో అత్యంత సున్నితమైనది. ఈ విషయంలో మీడియా చాలా జాగ్రత్తగా చెప్పాల్సింది పోయి.. ఎటువంటి బాధ్యత లేకుండా మీడియా వ్యవహరిస్తోందన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీనివల్ల ఇప్పుడు టీవీలలో వచ్చే బ్రేకింగ్ లను ప్రజలే నమ్మేలా కనిపించడం లేదు.