భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ - భారత్ పై దొంగ దెబ్బ తీస్తుంటే భారత్ నేరుగా పాకిస్తాన్ లోని ఉగ్రవాదులపై అటాక్ చేస్తోంది. ఇదిలా ఉండగా....పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోని 28 మందిపై దాడి చేసి చంపేశారు. దీనిపై ప్రతి కారం తీర్చుకునేందుకు భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులపై దాడిని చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. ఒకరిపై ఒకరు విపరీతంగా దాడులు చేసుకుంటున్నారు. 

పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు మోడీ ప్రభుత్వం సింధు నది జలాలను ఆపేశారు. దీంతో పాకిస్తాన్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారత్ - పాకిస్తాన్ యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. పాకిస్థాన్ లోని చక్వాల్, రావాల్పిండి, షార్ కోట్ ఎయిర్ బేస్ ల పైన భారత్ ఆర్మీ దాడి చేస్తుంది. దానివల్ల పాకిస్తాన్ లోని ఆర్మీకి తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. అటు పాకిస్తాన్ లైనప్ కంట్రోల్ వెంబడి భారత పౌరులపై దాడులకు పాల్పడుతున్నారు.

భారత ఎయిర్ బేస్ లపై మిస్సైల్లతో దాడి చేయగా.... వాటిని భారత్ ఆర్మీ సమర్థంగా అడ్డుకున్నారు. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. భారత ప్రభుత్వంతో యుద్ధం కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా నష్టాలను చవిచూస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికోసం అంతర్జాతీయ బ్యాంకులను అప్పులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

మరోవైపు ఇస్లామాబాద్ లో రాబోయే మరో 48 గంటల పాటు అన్ని పెట్రోల్ బంకులను మూసివేయనున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే పెట్రోల్ దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ లో ఉన్న చమురు నిల్వలు అన్ని అయిపోయాయి. దీంతో పాకిస్తాన్ వాసులు అనేక రకాలుగా ఇబ్బందుల పాలు అవుతున్నారు. చిన్నపిల్లల కూడా నీటికీ, తిండికి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది పాకిస్తాన్ వాసులు యుద్దాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: