విద్యార్థుల జీవితాలు బాగు చేస్తామని ఎంతోమంది బోగస్ ఇనిస్టిట్యూట్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.  ఇలాంటి ఇనిస్టిట్యూట్స్ లను నమ్మి ఎంతో మంది తల్లిదండ్రులు విద్యార్థులు మోసపోతూనే ఉన్నారు.  తాజాగా  మలక్ పేట్ మూసారంబాగ్  లోని ఫార్చ్యూన్ ఫ్లయర్స్ ఏవియేషన్ అకాడమీ  ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చి 250 మంది విద్యార్థులను మోసం చేసింది. ఫార్చ్యూన్ ప్లయర్స్ ఏవియేషన్ అకాడమీ లో ఒక్కొక్క విద్యార్థికి 90 వేల రూపాయలు తీసుకొని జాబ్ ఇప్పిస్తామంటూ ఆరు నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చి ఐఎఫ్ మరియు ఐ ఏ ఓ స్టాంపు తో ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు.


ఇక సర్టిఫికెట్ ఉంది కదా అని జాబ్ కి వెళితే చుక్కలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు జాబ్ కోసం కంపెనీ వద్దకు వెళితే మీ ఎకాడమీ కి రిజిస్ట్రేషన్ లేదు అంటూ విద్యార్థులను వెనక్కి పంపారు.. తీరా విద్యార్థులు అకాడమీ దగ్గరికి వచ్చి చూస్తే టూలేట్ బోర్డ్ దర్శనమిచ్చింది. బాధిత విద్యార్థులు  మలక్ పేట్ పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: