దక్షిణాది వెండితెరపై దశాబ్దాల పాటు తన కళ్ళతోనే కోట్లాది మంది మనసులను కొల్లగొట్టిన నటి మీనా. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి 'ఎవర్ గ్రీన్ బ్యూటీ'గా పేరు తెచ్చుకున్న ఆమె, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం అందరికీ తెలిసిందే. అయితే, గత కొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ రూమర్లపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మీనా,తాజాగా అత్యంత ఘాటుగా స్పందించారు.మీనా భర్త విద్యాసాగర్ మరణించిన తర్వాత, ఆమె ఒంటరిగా ఉంటోందని.. తన కూతురు నైనిక భవిష్యత్తు కోసం లేదా తన పాత స్నేహితుడు అయిన ఒక స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని నెట్టింట తెగ ప్రచారం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మీనాను ప్రశ్నించగా, ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


"ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఒకరు బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చకపోయినా పర్వాలేదు కానీ, ఇలాంటి లేనిపోని వార్తలను పుట్టించి వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం?" అని మీనా ప్రశ్నించారు. ముఖ్యంగా తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు.తన జీవితంలో తన కూతురు నైనిక కంటే ఏదీ ముఖ్యం కాదని మీనా ఎమోషనల్ అయ్యారు. "నా భర్త మరణం నా జీవితంలో ఒక తీరని లోటు. ఆ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా నా కూతురు చదువు, ఆమె భవిష్యత్తు మరియు నా సినిమా కెరీర్ పైనే ఉంది. రెండో పెళ్లి అనే ఆలోచనే నా మనసులో లేదు. మీడియా వారు దయచేసి బాధ్యతారాహిత్యంగా వార్తలు రాయకండి" అని హితవు పలికారు.



ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు హద్దులు దాటుతున్నాయి. దీనిపై కూడా మీనా స్పందిస్తూ.. "ఎవరో ఏదో రాస్తే అది నిజమైపోదు. నా గురించి నేను ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా నేనే చెబుతాను. అంతవరకు ఊహాగానాలను నమ్మకండి. ఒక మహిళగా, ఒక తల్లిగా నేను పడుతున్న కష్టాన్ని గౌరవించండి" అని గట్టిగానే చెప్పారు.వార్తలకు స్వస్తి చెప్పి, మీనా ఇప్పుడు తన వృత్తిపై పూర్తి ఫోకస్ పెట్టారు. 'దృశ్యం' వంటి హిట్ సినిమాల తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అటు సినిమాలు, ఇటు బుల్లితెరపై రియాలిటీ షోలతో ఆమె బిజీగా గడుపుతున్నారు. తన చుట్టూ ఉన్న నెగిటివిటీని పక్కన పెట్టి, ఒక పవర్ ఫుల్ ఉమెన్ లాగా మీనా ముందుకు సాగుతుండటం చూసి ఆమె అభిమానులుఎప్పుడూ సాఫ్ట్ గా ఉండే మీనా, ఇలాంటి సున్నితమైన విషయంలో ఇంత ధైర్యంగా స్పందించడం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "మీనా గారు చెప్పింది వంద శాతం నిజం.. ఒకరి బాధను వ్యాపారంగా మార్చుకోకూడదు" అంటూ ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: