ఈవెంట్ లో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తాను ఎప్పుడూ కూడా ఫిమేల్ రైట్స్ కోసం నిలబడతానని , తాను చేసిన సినిమా కూడా అలాంటి సినిమానే.. నేను తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం కావడానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారే కారణం. నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చింది తెలుగు ప్రేక్షకులే వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసింది.
నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి అందుకే ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను.. సరస్వతీ సినిమా రియల్ గా చాలా మంచి సినిమా ప్రమోట్ చేయడానికి తాము ట్రై చేస్తున్నాము. ప్రతి ఒక్కరు సినిమా చూడండి ఇండస్ట్రీలో మహిళలు ఎదగడానికే సహాయం చేయండి. సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను కానీ ఎందుకో స్టేజి మీదకి రాగానే అలా అనిపించిందని తెలియజేసింది. నేను ఇండస్ట్రీలో ఉండే ప్రతి అమ్మాయి కోసం నిలబడడానికి ట్రై చేస్తాను, ఒక అమ్మాయిగా ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టమంటూ స్టేజి మీద ఎమోషనల్ గా మాట్లాడింది వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ కి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎదురైన ఇబ్బందులు ఏంటి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి