సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. మొదటిసారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండడంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 50% వరకు పూర్తి అయినట్లుగా సమాచారం. ఏప్రిల్ 7న 2027 లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇవే కాకుండా మరో ఐదు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం.


ఇందులో భాగంగా వారణాసి సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి తెలియజేశారు. మహేష్ బాబు రాముడు పాత్రకు సంబంధం ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టర్ వారణాసి సినిమాకి సంబంధించినదే అంటూ అభిమానులు కూడా వైరల్ గా చేస్తున్నారు. ఇటీవలే గుంటూరులోని మైత్రి సినిమాస్ లో డిజిటల్ పోస్టర్ ను ఏర్పాటు చేయగా ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లు తెలుస్తోంది.


దీంతో ఈ పోస్టర్ మహేష్ బాబుకు సంబంధించిన లేకపోతే ఏదైనా ఏఐ ద్వారా క్రియేట్ చేశారా అనే విషయంపై అభిమానులు సందేహ పడుతున్నారు. ఈ విషయం పైన చిత్ర బృందం మాత్రం అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన తెలుపలేదు. మరీ ఈ పోస్టర్ పైన రాజమౌళి అయిన స్పందిస్తారేమో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్, పోస్టర్స్ సినిమా పైన అంచనాలను పెంచేలా చేశాయి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు, అలాగే ప్రకాష్ రాజ్ తో పాటగా మరికొంతమంది నటీనటులు నటిస్తున్నారు. భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న వారణాసి సినిమా మరి ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఈ విషయం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: