ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు 5 వేలు దాటేయగా, కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువలో చేరాయి.  అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి.  ఇక, గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతున్నాయి.  ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 81 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో కలిపి తూర్పు గోదావరిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 81,064 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉంటే కోవిడ్ నిబంధనల మధ్య ఏపీ ఎంసెట్ పరీక్షలు జరగుతున్నాయి.

నేటి నుంచి 25 తేదీ వరకు ఏపీ ఎంసెట్ జరగనుంది.  నిమిషం ఆలస్యమైనా ఎగ్జామినేషన్ హాల్‌లోకి నో ఎంట్రీ. ప్రతి విద్యార్థి మాస్కు తప్పని సరిగా ధరించాలి.  అయితే కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే వారికి ప్రత్యేక ఏర్పాటు చేసి పరీక్షించేందుక సిద్దమయ్యారు.  ఇక  ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 2 లక్షల 72,946మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లో 115 సెంటర్స్ తెలంగాణలో 3 సెంటర్లను ఏర్పాటు చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: