ఏపీలో నాలుగోద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు చోట్ల టీడీపీ మ‌ద్ద‌తుదారులు విజ‌యం సాధిస్తున్నారు. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామంలో 500 ఓట్ల మెజారిటీ తో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు సాధించారు. ఈ పంచాయ‌తీలో 10 వార్డులకు 9 వార్డులు టీడీపీ మ‌ద్ద‌తు దారులు కైవసం చేసుకున్నారు. ఈ పంచాయతీ లో టీడీపీ ని ఓడించాలి అని గత 38 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా.. ప్ర‌త్య‌ర్థుల ఆట‌లు మాత్రం సాగ‌డం లేదు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఇక్క‌డ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పార్టీ అభ్య‌ర్థుల‌తో పోటీ చేయించినా చేదు అనుభ‌వం త‌ప్ప‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: