భారత్ లో అతి త్వ‌రలోనే మ‌రో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాకు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కి సిఫార్సులు పంపించింది. జైకోవ్‌-డి వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ క్యాడిలా జులై 1వ తేదీన దరఖాస్తు చేసుకుంది. 

ఈ వ్యాక్సిన్ కు 66.6 శాతం సమర్థత ఉంది. అంతే కాకుండా డీఎన్‌ఏ సాంకేతికతతో ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. 12 ఏళ్ల పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని వెల్లడించిన జైడస్‌ క్యాడిలా స్ప‌ష్టం చేసింది. అనుమతులు వచ్చిన వెంట‌నే ఏటా 24కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా జైడస్‌ క్యాడిలా ల‌క్ష్యంగా పెట్టుకుంది. జైకోవ్‌-డి టీకాకు అనుమతులు లభించిన‌ట్ల‌యితే ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: