ఆహాలో బాలయ్య టాక్ షో దీపావళి ధమాకా గా ఈ రోజు ప్రసారమవుతోంది. దాంతో బాలయ్య అభిమానులు అంతా టీవీలకు అతుక్కుపోయారు. ఇక బాలయ్య షోతో ఆహాకు మరింత క్రేజ్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బాలయ్య టాక్ షో చేసేందుకు అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. బాలయ్య టాక్ షోకు మొదటి గెస్ట్ గా మంచు మోహన్ బాబు తో పాటు మా అధ్యక్షుడు విష్ణు మరియు మంచు లక్ష్మి హాజరైన సంగతి తెలిసిందే. 

ఇటీవల విడుదల చేసిన బాలయ్య టాక్ షో ప్రోమో ఆకట్టుకోగా ఇక ఈ రోజు ప్రసారం అవుతున్న టాక్ షో డబుల్ ధమాకా గా ఉందని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ షోలో మోహన్ బాబును మీ పక్కన నటించిన వాళ్ళలో మీకు నచ్చని వాళ్ళు ఎవరు అని బాల‌య్య ప్ర‌శ్నించారు. దాంతో ఆడాళ్లా మ‌గాళ్లా అని మోహ‌న్ బాబు అడిగారు. ఎవరైనా పర్లేదు పేరు చెప్పండి అని బాల‌య్య‌ ప్రశ్నించారు. అయితే ఆ ఒక్క ప్రశ్న అడగకండి ఇబ్బందిగా ఉంది అంటూ మోహన్ బాబు సమాధానమిచ్చారు. దాంతో మోహన్ బాబు సరసన మొదట నటించింది ఎవరు అన్న ది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: