ఉదయం పూట ఓ కప్పు బ్లాక్ కాఫీ.. మధ్యాహ్నం ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆర్గానిక్ కాఫీ పొడులతో తయారు చేసే బ్లాక్ కాఫీని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది.  ఉదయం పూట బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా రోజంతా చురుకుగా వుండగలుగుతారు. ఉదయం ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా శరీర బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆహారాన్ని మితంగా తీసుకోగలుగుతారు. తద్వారా ఒబిసిటీ దరి చేరదు.

Image result for block tea green tea

అలాగే ప్రతిరోజు రెండు లేదా మూడు కప్పుల బ్లాక్‌ కాఫీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. బ్లాక్ కాఫీ వల్ల రక్తంలోకి అడ్రినలిన్ విడుదలవుతుందని, దీంతో కొవ్వు కరుగుతుంది. అలాగే, లివర్ కేన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చునని తాజా అధ్యయనంలో తేలింది.
ప్రతిరోజు కాఫీ తాగితే శరీర మెటబాలిజం యాభై శాతం వరకు పెరుగుతుంది.
Image result for block tea green tea
ప్రతిరోజు రెండు కప్పుల కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని పరిశోధకులు అంటున్నారు. అంతేగాకుండా, బ్లాక్ కాఫీ తాగితే ఒత్తిడికి కూడా దూరంగా ఉండొచ్చనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: