అందం ప్రతిఒక్కరికి ముఖ్యం. అలా అని ప్రతిసారి మనం అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగలేము.. కానీ ఈ చిట్కాలు పాటిస్తే ఏలాంటి అందం అయినా మీ సొంతం అవుతుంది. అయితే మనం అందంగా.. ఆరోగ్యంగా.. పొట్ట కొవ్వు కరగడం కోసం.. శరీరంలోని విషపదర్ధాలను బయటకు పంపడం కోసం హెర్బల్‌ టీ తాగుతాం. 

 

అయితే ఈ హెర్బల్‌ టీ బ్యాగ్‌లో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ గుణాలున్న పాలీఫినాల్స్‌ ఉంటాయి. ఆ గుణాలు అన్ని కూడా చర్మ సంబంధ ఇన్‌ఫెక్షన్లను దరిచేరనివ్వవు. దాంతో చర్మం సహజ మెరుపుతో తాజాగా కనిపిస్తుంది. అయితే ఆ చిట్కాలను ఎలా పాటించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

ఎక్కువ సమయం పనిచేయడం, కంటి నిండా కునుకు లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. అయితే ఆలా కనిపించిన సమయంలో కళ్ల మీద చల్లని టీ బ్యాగ్‌ను కొద్దిసేపు ఉంచితే కళ్ల వాపు తగ్గుతుంది. అంతేకాదు ఈ టీ బ్యాగ్ తో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కళ్ల మంట, కళ్లు ఎరుపెక్కడాన్ని తగ్గిస్తాయి. 

 

ముక్కు, నుదురు భాగంలో నల్లమచ్చలను గ్రీన్‌ టీ బ్యాగ్‌తో మాయం చేయొచ్చు. టీ బ్యాగ్స్‌ చర్మం మీది మలినాలు, మృతకణాలను తొలగించి, చర్మ రంధ్రాలు తెరచుకునేలా చేస్తాయి. అంతేకాదు.. హెర్బల్‌ టీ ఆకుల్ని పొడిచేసుకొని అందులో కలబంద గుజ్జు కూడా కలపితే హెర్బల్‌ ఫేస్‌ప్యాక్‌ తయారవుతుంది.. ఫేస్ అందంగా మారుతుంది. చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ అందాన్ని కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: