సాధారణంగా వయసు పెరిగే కొద్దీ, ముఖం మీద ముడతలు రావడం సహజం. కానీ కొంతమందికి చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంతే కాకుండా ముఖం పైన ముడతలు, గీతలు కనిపిస్తూ పెద్దవయసు వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలి అన్నా, ముందే ముఖం మీద ముడతలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు సౌందర్య నిపుణులు. అయితే ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


 నీళ్లు ఎక్కువగా తాగడం :
శరీరం హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. కానీ శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోతే, చర్మం పొడిబారే ప్రమాదం ఉంది. ఫలితంగా నుదిటి మీద ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఇక దీంతో చిన్న పిల్లలు కూడా వయస్సు పై బడిన వారిలా కనిపిస్తాయి. కాబట్టి రోజుకు ఆరు నుండి ఏడు గ్లాసుల నీటిని తీసుకోవాలి. అలాగే వర్కౌట్లు చేస్తూ, శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేలా చూసుకోవాలి. కేవలం నీళ్లను మాత్రమే కాకుండా కొబ్బరినీళ్ళు, తాజాపండ్లు, నిమ్మరసం వంటివి తాగుతూ ఉండాలి.


ఒత్తిడికి దూరంగా ఉండాలి :
విపరీతమైన ఆందోళన, ఒత్తిడి కారణంగా కూడా ముఖం మీద ముడతలు, మొటిమలు రావడం మొదలుపెడతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం పర్యావరణంలో ఎక్కువసేపు గడపటం, యోగా, మెడిటేషన్,వర్కౌట్ లను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అంతేకాకుండా రోజుకు సరిపడా నిద్ర కూడా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది..


సమతుల్య ఆహారం తీసుకోవడం :
మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందేలా చూసుకోవాలి. లేకపోతే మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ప్రత్యేకించి విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు  చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తాయి. కాబట్టి వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ,పాలకూర,వాల్నట్, చిలకడదుంప,బ్లూబెర్రీ లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాకుండా తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా, ముఖం అందంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: