మేకప్ రిమూవ్ చేయకపోవడం..
సాధారణంగా ఫంక్షన్లనో,పార్టీలనో మేకప్ వేసుకుంటూ ఉంటారు.అలాంటప్పుడు ఒక్కొక్కసారి రాత్రి సమయం మించిపోయి అలానే పడుకుంటూ ఉంటారు.కానీ దీనివల్ల ఉన్న కెమికల్ ప్రొడక్ట్స్ తో స్కిన్ దెబ్బతిని మొటిమలు,మచ్చలు అధికమై,చర్మంపై గుంటలు గుంటలుగా పడటం,చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కావున స్త్రీలు పడుకోబోయే ముందు కచ్చితంగా మేకప్ రిమూవ్ చేయడం చాలా ఉత్తమం.
ఒత్తిడి కారణంగా..
చాలామంది ఒత్తిడి కారణంగా శరీరాకృతి మరియు ఆరోగ్యం దెబ్బతింటుందని అనుకుంటూ ఉంటారు.కానీ దీనివల్ల మొటిమలు మచ్చలు ఏర్పడతాయని చాలామందికి తెలియదు.కావున స్త్రీలు ఒత్తిడి తగ్గించుకోవడానికి తగిన యోగా,వ్యాయామం చేయడం ఉత్తమం.
జంక్ ఫుడ్ తినడం..
అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ క్యాండీలో చాక్లెట్లు అధికంగా తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇంకా కొంతమందిలో అధిక సెబం కారి,ముఖం అందవిహీనంగా తయారవుతూ ఉంటుంది. కావున జంక్ ఫుడ్ కి వీరు కచ్చితంగా దూరంగా ఉండాలి.
చీప్ మేకప్ కిట్స్ వాడడం..
తక్కువకే వస్తున్నాయి కదా అని,వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో అనేది చూడకుండా మేకప్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.దీనివల్ల వారి చర్మ ఆరోగ్యం దెబ్బతిని మొటిమలు,మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నీరు అధికంగా తాగకపోవడం..
నీరు అధికంగా తాగడం వల్ల మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని అపోహతో చాలా మంది నీరు తీసుకోకుండా ఉంటారు.దీనివల్ల చర్మం డిహైడ్రేట్ అవ్వడమే కాకుండా, మొటిమలు,మచ్చలను కూడా ఏర్పరుస్తుంది.కావున ప్రతి ఒక్కరూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగడం చాలా ఉత్తమం.కాబట్టి స్త్రీలు ఈ ఐదు తప్పులను చేయకుండా ఉంటే మొటిమల నుంచి చాలా వరకు దూరంగా ఉండవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి