హెయిర్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు వాటిలో కచ్చితంగా కొన్ని ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఎర్ర ఉల్లిపాయలు జుట్టుకి చాలా మేలు చేస్తాయి.ఎందుకంటే వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని పేస్ట్ చేసి తలకు మర్ధన చేయడం వల్ల తలలో పుండ్లు, చర్మసంబంధిత వ్యాధులు తలెత్తవు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పైగా స్కల్ సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఈ ఉల్లిలోని మూలకాలు చుండ్రు, పేలు, దురదను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో లభించే సల్ఫర్ చర్మ, జుట్టు సంబంధిత చికిత్సలో ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది.త్రిఫల కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది త్రిదోషిక్ అనే రసాయనం. త్రిదోషిక్ అంటే శరీరంలోని మూడు దోషాలను నివారించేది. అసమతుల్యతను సమతుల్యంగా చేస్తుంది. వాత, పిత్త, కఫాన్ని నివారిస్తుంది. జుట్టుకు దీనికి సంబంధం ఏంటి అనే అనుమానం మీలో రావచ్చు. జుట్టు పెరుగుదల, రాలిపోవడానికి ప్రధాన కారణాలు బాహ్యంగానే కాకుండా లోపల రక్తంలోని లోపాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.


అందుకే వీటిని ఉపయోగించడం వల్ల కురుల్లో నుంచి చర్మం లోపలకు చొచ్చుకొని పోయి మంచి ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. అంతర్గతంగా ఉన్న రక్తంలోని లోపాలను ప్రక్షాలన చేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు కలిగేందుకు సహాయపడుతుంది.ఇంకా అలాగే కలబందలో విటమిన్ ఎ, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని పచ్చిగా జూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. తద్వారా జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయడమే కాకుండా శరీరంలోని విటమిన్ లోపాన్ని అధిగమిస్తుంది. ఈ మూడు విటమిన్లు శరీరంలోని కణాల వృద్దికి ఎంతగానో సహాయపడతాయి.జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా నిగనిగలాడేలా, మెరిసేలా చేస్తుంది. అలోవెరా జెల్ లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఉంటుంది. ఈ రెండు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. వెంట్రుకలను మృదువుగా ఉండేలా చేస్తుంది.అలాగే ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకం పుష్కలంగా ఉండటం వల్ల కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలకుండా నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ అక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీని వల్ల త్వరగా నెరసిపోవడం, రంగు మారిపోవడం వంటి సమస్యలు తలెత్తవు. పైగా ఆమ్లాను మన జుట్టు సౌందర్యసాధనాల్లో కలిగి ఉండటం వల్ల తలలో దురదలు, చికాకు, చుండ్రు వంటి సమస్యలు ధరిచేరకుండా రక్షణగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: