టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా ద్వారా రంగప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయన కొన్ని సినిమాలు యూట్యూబ్ లో అక్కడి ప్రేక్షకులను అలరించగా తనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉందని బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు శ్రీనివాస్.. అయితే బాహుబలి సినిమా దగ్గరినుంచి బాలీవుడ్ లో తెలుగు సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.. ఈ నేపథ్యంలో బెల్లంకొండ స్ట్రెయిట్ గా ఓ హిందీ చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి.. నిజంగా చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ తెలుగులోనే అంత సఖ్యతగా లేదు..