ఏపీలో క‌రోనా వైర‌స్ కోర‌లు చాస్తోంది. అటు ప్ర‌భుత్వంతో పాటు ఇటు వైసీపీ మంత్రులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డికక్క‌డ త‌మ వంతుగా ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నారు. రాష్ట్రంలో ప్ర‌తి గ్రామంలోనూ సామాన్య వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం చందాలు వేసుకుని పేద‌ల‌ను ఆదుకునేందుకు కూర‌గాయాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఎవ‌రికి తోచిన సాయం వారు చేస్తున్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం యంత్రాంగం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం హైద‌రాబాద్లో ఉంటూ ఇటు జ‌గ‌న్‌, వైసీపీ ప్ర‌భుత్వంపై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తూ పొద్దు పుచ్చుతున్నారు.

 

ఇలాంటి సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఏం చేయాలి ?  ప్ర‌జ‌ల‌ను ఎలా ఆదుకోవాలా ?  త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌లకు సూచించాల్సింది పోయి చంద్ర‌బాబు ప్రెస్‌మీట్లు పెడుతూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక బాబోరు ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేసే విష‌యంలో కూడా నిర్మాణాత్మ‌క‌మైన ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు చిన‌బాబోరు అయిన నారా లోకేష్ కూడా త‌న‌కు అల‌వాటైన చందంగానే ట్విట్ట‌ర్ పిట్ట మాదిరిగా మారిపోయి.. ట్విట్ట‌ర్లో ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌డుతున్నారు.

 

తాజాగా లోకేష్ త‌న ట్వీట్ట‌ర్‌లో 14 రోజుల క్వారంటైన్ పూర్తయిన పేదలకు 2 వేల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. మరి లాక్ డౌన్ కారణంగా 40 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్న పేదల పరిస్తితి ఏంటి? ఇప్పటికే 23 రోజులుగా పనులు లేక, అప్పు పుట్టక పేదలు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకోవాలంటున్నారు. వైసీపీ వాళ్లు మాట‌ల్లో త‌ప్ప క్షేత్ర‌స్థాయిలో రైతుకు గిట్టుబాటు ధ‌ర ఇవ్వ‌డం లేద‌ని కూడా విమ‌ర్శించారు. 

 

అరటి, మామిడి రైతుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. అకాల వర్షాల కారణంగా పంట నష్టం అంచనా లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే పంట నష్టం అంచనా పూర్తి చేసి రైతులకు పరిహారం చెల్లించాలంటున్నారు. చిన‌బాబోరు విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపుతూ భ‌ర‌సా క‌ల్పించే ప్ర‌య‌త్నం ఏదైనా చేస్తే బాగుంటుంది క‌దా ? అంటున్నారు ఆంధ్రా ప్ర‌జ‌లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: