తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతున్నా... వ్యవసాయ రంగానికి మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని ఆపేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని... తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు రైతు బంధు పథకం ఆగదని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఈ పథకాన్ని ఆపే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నంతవరకు ఈ పథకం అమలు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని రైతులందరూ ధనవంతులు అయ్యేవరకు రైతుబంధు పథకం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం వర్షాకాలం పంటకు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25,000 రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటన చేశరు. ఈరోజు 1,200 కోట్ల రూపాయలు 25,000 రూపాయల లోపు రుణమాఫీ కోసం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: