గత మూడు రోజులుగా పశ్చిమ బెంగాల్ ని అంఫాన్ తుఫాన్ ముంచెత్తుతుంది. దీనితో బెంగాల్ తీర ప్రాంతాలు అన్నీ కూడా ఇప్పుడు వర్షంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఎవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. తీర ప్రాంతం మొత్తం కూడా ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. ఇక ఈ తుఫాన్ ధాటికి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

దీనిపై బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పందించారు. కరోనా కంటే అతిపెద్ద ఉపద్రవం తుఫాన్ అంటూ ఆమె కామెంట్స్ చేసారు. ఇక ఒరిస్సా లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి నాలుగు జిల్లాల్లో ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తుఫాన్ తీరం దాటిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: