ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన లో భాగంగా ఈరోజు వైద్యంపై సదస్సు నిర్వహించారు. సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మెనిఫెస్టోలో చెప్పామని మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని అన్నారు. వైయస్సార్ పేదలకు వైద్యం, విద్య అందాలని కష్టపడ్డారని... ఆయన మరణం తరువాత వైద్యం, విద్య పేదవాడికి దూరమయ్యాయని చెప్పారు. 
 
రాష్ట్రంలో కోటీ 42 లక్షల మందిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని అననౌర్. రాష్ట్రంలో 2019 నవంబర్ 8 నుంచి అమలు చేశామని... జులై 8 నుంచి ఆరు జిల్లాల్లో ఈ పథకం అమలులోకి రానుందని తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకుండా ఆస్పత్రులను ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి గత ప్రభుత్వం 682 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చంద్రబాబు హయాంలో చెల్లించాల్సిన నగదును కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని సీఎం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: