తెలంగాణ పోరాటంలో ప్రజలను ఎంతో ఉత్తేజ పరిచి లాఠీ చార్జీలను కూడా లెక్కచేయకుడా నాయకుడిగా ముందుకు నడిపించారు తన్నీరు హరీష్ రావు.. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు.  మంత్రిగా హరీష్ రావు తన బాధ్యతలు నిర్వహించడమే కాదు.. మామ సీఎం కేసీఆర్ కి తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు.  నేడు మంత్రి హరీష్ రావు పుట్టినరోజు.. కానీ ఆయన మాత్రం  కరోనా కారణంగా ఈసారి తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరినీ కలవలేకపోతున్నానని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వేడుకలు జరుపుకోవడం, కలవడం మీకు నాకు శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు.

 

కరోనా వ్యాప్తి కారణంగా ఎలాంటి వేడుకలు కూడా జరపవద్దని కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. మంత్రి హరీష్ రావు 49వ వసంతంలోకి ఆయన నేడు అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హరీశ్‌కు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ సోషల్ మాద్యం ద్వారా హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆర్థికశాఖ మంత్రి, డైనమిక్‌, కష్టజీవి.. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ప్రజా సేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నా బావా అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: