ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్న జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తాజాగా జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్‌ ఎనర్జీ ​కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 
 
తాజాగా ప్రభుత్వం వీటికి అనుమతిచ్చింది. రైతులకు అందించే సబ్సిడీని గత ప్రభుత్వాలు ఇచ్చిన దానితో పోలిస్తే జగన్ సర్కార్ మూడు రెట్లు పెంచింది. గత ప్రభుత్వం 2015 - 16 లో 3186 కోట్ల సబ్సిడీని ఇస్తే ప్రస్తుతం దానిని 8354 కోట్లకు పెంచింది. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇది రెట్టింపుకన్నా ఎక్కువే కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: