తెలంగాణాలో ఇంటర్ ఫలితాలు ఏమో గాని ఇప్పుడు అక్కడి విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి మహబూబ్ నగర్, గద్వాల, బద్వేల్, నాగర్ కర్నూల్ లో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిర్మల్ లో అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఒకరు ఉరి వేసుకుని మరొకరు పురుగుల మందు తాగి మరొకరు బావిలో దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయి అని గజ్వేల్ కి చెందిన ఒక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. మొత్తం ఆరుగురు విద్యార్ధులు ఫలితాలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సర్వతా ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి తల్లి తండ్రులు విద్యార్ధులకు అండగా నిలవాలి అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి