టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ కు లేఖ రాశారు. జగన్ సర్కార్ నూతన ఇసుక పాలసీ పేరుతో నాలుగు నెలల సమయం వృథా చేసిందని.... రాష్ట్రంలో దాదాపు 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. గతంలో మాదిరి కార్మిక సంక్షేమ పథకాల అమలు చేయాలని కోరారు. 
 
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన రోజు నుంచి భవన నిర్మాణ కార్మికులకు వెతలు మొదలయ్యాయని... రాష్ట్రంలో ఓ మంత్రికి ఇసుకకు బదులు మట్టి పంపించారంటే ఇసుక మాఫియా ఏ స్థాయిలో పేట్రేగిపోతోందో అర్థమవుతుందని అన్నారు. స్టాక్ యార్డు ముసుగులో దోపిడీ జరుగుతోందని వైసీపీ నేతలు, అధికారులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: