అంతర్వేది ఘటన విషయంలో ఏపీ సర్కార్ ఇప్పుడు సిబిఐ విచారణకు ఆదేశాలు  జారీ చేసింది. దీనితో సర్వత్రా కూడా ఈ విచారణపై ఇప్పుడు ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో  ఏపీ కాంగ్రెస్ నేత జంగా గౌతం సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతర్వేది రథం దగ్ధం విషయం లో సిబిఐ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ని విచారించాలని డిమాండ్ చేసారు. విజయసాయిరెడ్డి వద్ద ఉన్న ఆధారాలు స్వీకరించాలన్నారు.

అసలు కుట్ర దారు చంద్రబాబు అని   విజయసాయిరెడ్డి తేల్చేస్తే ఇక ప్రభుత్వం విచారణకు సీబీఐకి కేసు ఎందుకు  ఇచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి? అని డిమాండ్ చేసారు. ఈ విషయం లో తగిన ఆధారాలు చూపలేకపోతే విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేదా అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ ని, విచారణను తప్పుతోవ పట్టించేలా మాట్లాడినందుకు విజయసాయిరెడ్డి ని అరెస్టు చేసి శిక్షించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: