భక్తుల కోసం మహారాష్ట్రలోని అన్ని మందిరాలను తెరవాలని డిమాండ్ చేస్తూ
బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం వద్ద ఆ
పార్టీ నాయకులు నిరసనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటి గుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు బిజేపి శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు
పార్టీ నాయకుడు
ప్రసాద్ లాద్ సహా కొంత మంది బిజేపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలో లిక్కర్ షాపులకు అనుమతిచ్చిన ప్రభుత్వం ఆలయాలను మాత్రం ఎందుకు తెరవడం లేదని బిజేపి నేత ప్రవీణ్ దరేకర్ ప్రశ్నించారు. మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మందిరాలపై ఆధారపడి జీవించే చిరు వ్యాపారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.