హైదరాబాద్ లో భారీ వర్షాల నేపధ్యంలో... రామంతపూర్ డివిజన్ నేతాజీ
నగర్ లో ప్రభుత్వం తరపున 10000 రూపాయల ఆర్ధిక సహాయన్ని మంత్రులు
కేటీఆర్ , మల్లారెడ్డి,
ఎమ్మెల్యే భేతి సుభాష్
రెడ్డి అందించారు. ఇక ఈ సందర్భంగా
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ముంపుకి గురైన ప్రతి ఇంటికి ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న స్థానికంగా ఉన్న
ఎమ్మెల్యే కి గాని కార్పొరేటర్ కి చెప్పాలని ఆయన సూచించారు. రామంతపూర్ పెద్ద చెరువు ను అనుకోని ఉన్న సాయి చిత్ర కాలనీ,
రవీంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామంతపూర్ పెద్ద చెరువు కు శాశ్వతం ఔట్
లెట్ చేయించాలని ఆయనకు స్థానికులు విజ్ఞప్తి చేయగా వెంటనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.