ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ మున్సిపాల్టీ గెలుచుకున్నా ఆ పార్టీ చైర్మ‌న్ అభ్య‌ర్థులు ఓడిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే గెలిచిన వెంట‌నే జంపింగ్‌లు కూడా జ‌రుగుతున్నాయి. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి మున్సిపాల్టీలో విచిత్రం చోటు చేసుకుంది. సత్తెనపల్లిలో జనసేన పార్టీ తరుపున గెలిచిన అభ్యర్థి కౌంటింగ్ పూర్తికాగానే వైసీపీలో చేరిపోయారు. ఏడోవార్డు నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి రంగశెట్టి సుమన్ విజయం సాధించారు. అలా డిక్లరేషన్ ఫారం అందుకున్నాడో లేదో రంగశెట్టి సుమన్ వైసీపీలో చేరిపోయారు. సత్తెన పల్లి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: