ఏపీలో జరిగిన మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార
వైసీపీ చరిత్ర క్రియేట్ చేసింది. ఆ
పార్టీ భారీ మెజారిటీతో రికార్డు సృష్టించింది. వైసీపీ ఓట్ షేర్ చెక్కు చెదరలేదు. వైసీపీకి ఏకంగా 73 మున్సిపాల్టీలు, 11 కార్పొరేషన్లు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వైసీపీ దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆ
పార్టీ ఓట్ షేర్ 52.63 శాతం కాగా,
టీడీపీ 30.73 శాతం, బీజేపీ 2.41 శాతం,
జనసేన 4.67 శాతం,
సీపీఐ 0.80 శాతం, సీపీఎం 0.81 శాతం, కాంగ్రెస్ 0.62 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే
టీడీపీ ఓట్ షేర్ భారీగా తగ్గింది.