తిరుపతిలో ఓ ఇంటిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు రావడంతో బీజేపీ, జనసేన తల పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గాజు గ్లాసు గుర్తు తమకు ఎక్కడ దెబ్బ వేస్తుందో అని బీజేపీ తెగ టెన్షన్ పడిపోతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ, జనసేన బృందం సమావేశమై తిరుపతి ఉప ఎన్నికలపై ఫిర్యాదు చేసింది. స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు ను కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ కావాలనే తమ ఓట్లను చీల్చేందుకే ఇలా వ్యవహరించిందని తమ ఫిర్యదులో పేర్కొన్నారు. ఈ బృందంలో సునీల్ దేవధర్, అబ్బాస్ నఖ్వీ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి